- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభివృద్ధి సంక్షేమమే ప్రజాపాలన ప్రభుత్వ ద్వేయం : మంత్రి జూపల్లి కృష్ణా రావు
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ అండ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు.

దిశ, పాన్ గల్ : అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ అండ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయానికి రూ.40 లక్షలతో నిర్మించనున్న ప్రహరీ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండలంలోని లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు కళ్యాణ లక్ష్మి పథకానికి రూ.లక్ష 116లతో పాటు తులం బంగారం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ఆదాయం గత ప్రభుత్వం చేసిన అప్పులకే వడ్డీ చెల్లించేందుకే సరిపోతుందన్నారు. ఎన్నికల హామీని అమలు చేసేందుకు కాస్త ఆలస్యం జరిగిందన్నారు.
రాష్ట్ర ఆదాయం వడ్డీలకి చెల్లిస్తున్నా కూడా అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించలేదన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500 కే గ్యాస్ సిలిండర్, రైతు రుణమాఫీ, రైతు భరోసాతో పాటు పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు ప్రభుత్వం చేస్తుందన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే మళ్లీ తిరిగి 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహశీల్దార్ అశోక్ కుమార్, ఎంపీడీవో గోవిందరావు, డీఈ ఎక్బాల్ హుస్సేన్, ఏఈ కవి రెడ్డి, సర్పంచ్ సత్తూరి నాగలక్ష్మి నరేందర్ గౌడ్, మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, నాయకులు రాము యాదవ్, బ్రహ్మయ్య పాల్గొన్నారు.






