గ్రామాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

by Ratna Kumari |

అచ్చంపేట మండలం పలకపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామ మహిళా సమాఖ్య భవనానికి ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.

గ్రామాల అభివృద్ధే  ప్రజా ప్రభుత్వ లక్ష్యం  ఎమ్మెల్యే  చిక్కుడు వంశీకృష్ణ
X

దిశ, అచ్చంపేట రూరల్: అచ్చంపేట మండలం పలకపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామ మహిళా సమాఖ్య భవనానికి ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ‌ మాట్లాడుతూ మహిళల స్వయం ఉపాధి, స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ఈ భవనం ఒక కీలక వేదికగా నిలుస్తుందని తెలిపారు. గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల విస్తరణతో పాటు మహిళల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఇందిరమ్మ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక పురోగతికి అండగా నిలుస్తోందని అన్నారు. గ్రామీణాభివృద్ధిలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేయడం తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ఎంతటి భారాన్నైనా భరిస్తుందని, ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంతోష్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ నాయకుడు గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయ‌కులు పాల్గొన్నారు.

Next Story