గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం : డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్

by Nallavelli.Anjaneyulu |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం : డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే అమలు చేయలేదని ఆరోపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు పరుస్తూ జనరల్ సీట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాలను మాడల్ విలేజ్ లుగా తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రానున్న మూడేళ్లలో ప్రజా సంక్షేమ కోసం మరిన్ని పథకాలు అమలు చేస్తామని తెలిపారు. బూత్, గ్రామ, మండల, పట్టణ స్థాయిల్లో పార్టీ కమిటీలను పూర్తిచేస్తామని అన్నారు. జిల్లా పార్టీని మరింత కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు పథకాలు వివరించి పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలకపాత్ర పోషించాలని కోరారు. సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, నాయకులు చంద్రకుమార్ గౌడ్, సీజే బెనహర్, వసంత, లింగం నాయక్ , బెక్కరి మధుసూదన్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, ఫయాజ్, అజ్మత్ అలీ, ఆవేజ్, రాములు యాదవ్ పాల్గొన్నారు.

Next Story