రాష్ట్ర అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యం : ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి

by Ratna Kumari |

రాష్ట్రాభివృద్ధే కాంగ్రెస్ ఏకైక ల‌క్ష్య‌మ‌ని.. ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందించ‌డ‌మే ప్ర‌భుత్వ ఆలోచ‌న అని ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అన్నారు. ప‌లు గ్రామాల‌కు చెందిన బీఆర్ఎస్ నాయ‌కులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

రాష్ట్ర అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యం : ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి
X

దిశ, తిమ్మాజిపేట : రాష్ట్రాభివృద్ధే కాంగ్రెస్ ఏకైక ల‌క్ష్య‌మ‌ని.. ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందించ‌డ‌మే ప్ర‌భుత్వ ఆలోచ‌న అని ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అన్నారు. ప‌లు గ్రామాల‌కు చెందిన బీఆర్ఎస్ నాయ‌కులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఆదివారం నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. గ్రామాలలో ప్రజలకు అందుబాటు ఉండి వారి సమస్యలు తెలుసుకొని త‌న‌ దృష్టికి తీసుకొస్తే.. తప్పకుండా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే బడ్జెట్ సమావేశంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని కోసం రాష్ట ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లకు అర్హులున్న పేదలకు కొండంత అండగా నిలిచిందన్నారు, ప్రభుత్వం నుండి అందాల్సిన సహాయ సహకారం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. కొత్తగా రేషన్ కార్డులు లేనివారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొనే సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పించి వారికి అండగా నిలుస్తుందన్నారు, ప్రతి ఒక్కరికి ఆరు కిలోల బియ్యాన్ని అందిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అభివృధి కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజలను మోసం చేసిన BRS పార్టీకి గ్రామాల నుంచి గట్టి తిరుగుబాటు మొదలైందని తెలిపారు.

అభివృద్ధి కోసం.. ప్రజల భవిష్యత్తు కోసం

అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసం భారీ సంఖ్యలో నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతుందన్నారు. అనంతరం నియోజకవర్గం నుంచి పలు మండలాలు బీజినపల్లి, తిమ్మాజిపేట తాడూరు, మండలాలకు చెందిన సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు, వార్డ్ మెంబర్లు గ్రామ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బోరుసుగడ్డ తండా సర్పంచ్ K.లలిత రవి నాయక్, ఉప సర్పంచ్ చావులి చందు, వార్డ్ మెంబర్లు గంగారం పెద్ద తండా సర్పంచ్ గోపాల్ నాయక్, వార్డ్ మెంబర్లు నాయకులు పాలెం గ్రామం మాజీ సర్పంచ్ బుర్రి యాదవ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మడ్డి బాల్ రాం గౌడ్, మేస్త్రి సంఘం నాయకుడు వట్టెపు నాగయ్య. హేమ్ల నాయక్ తండా సర్పంచ్ కేతావత్ కృష్ణ కుమార్ భల్లన్ పల్లి సర్పంచ్ భారతమ్మ నరసింహ ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్రామ్ రెడ్డి, మల్లయ్య గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, మూడవత్ గోవిందు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story