అన్ని రంగాల్లో అభివృద్ధి ప్రథమ స్థానంలో నిలపాలి : కలెక్టర్ విజయేందిర బోయి

by Ratna Kumari |

ఈ నూతన సంవత్సరంలో అభివృద్ధి, సంక్షేమం, పథకాలు అమలులో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు జిల్లా అధికారులు, ఉద్యోగస్తులు కలిసికట్టుగా పనిచేయాలని కలెక్టర్ విజయేందిర బోయి పిలుపునిచ్చారు.

అన్ని రంగాల్లో అభివృద్ధి ప్రథమ స్థానంలో నిలపాలి :  కలెక్టర్ విజయేందిర బోయి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఈ నూతన సంవత్సరంలో అభివృద్ధి, సంక్షేమం, పథకాలు అమలులో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు జిల్లా అధికారులు, ఉద్యోగస్తులు కలిసికట్టుగా పనిచేయాలని కలెక్టర్ విజయేందిర బోయి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మధుసూదన్ నాయక్, ఏఓ సువర్ణరాజ్, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, నాల్గవ తరగతి ఉద్యోగ సంఘం, టిఎన్జీఓల సంఘం నాయకుల సమక్షంలో కలెక్టర్ కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత సంవత్సరం మాదిరే, ఈ నూతన సంవత్సరంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు పరస్పర సహకారంతో పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం అధికారులు, ఉద్యోగస్తులు, వివిధ సంఘాల నాయకులు కలెక్టర్ విజయేందిర బోయి కీ పూల బొక్కెలు, బుక్కు, పెన్నులు, వాటర్ బాటిల్స్ అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Next Story