- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమ సంబంధం.. హత్య కేసును ఛేదించిన పోలీసులు
దిశ, దేవరకద్ర : గత నెల దేవరకద్ర మండలం అడవి అజిలాపూర్ గ్రామానికి చెందిన హమాలీ పని చేసుకొని జీవనం గడుపుతున్న దానం మైబు హత్య

దిశ, దేవరకద్ర : గత నెల దేవరకద్ర మండలం అడవి అజిలాపూర్ గ్రామానికి చెందిన హమాలీ పని చేసుకొని జీవనం గడుపుతున్న దానం మైబు హత్య కేసును ఎట్టకేలకు బుధవారం దేవరకద్ర పోలీసులు చేదించారు. మైబు హత్య కేసులో నిందితులు ఏ1 అక్కినోళ్ల హనుమన్న, ఏ2 గొల్ల మల్లేష్, ఏ3 గంజి శరత్, ఏ4 మ్యాదరి చిన్న రాములు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఏ3 గంజి శరత్ మరొక కేసులో జైల్లో ఉన్నాడు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మృతుడు దానం మైబు కొడుకు అంజి అలియాస్ అనిల్ A1హనుమన్న మరదలు లక్ష్మమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని హనుమన్న తమ్ముడు రాఘవులకు తెలిసింది. దీంతో తన భార్య లక్ష్మమ్మతో తరచూ గొడవ పడేవాడు. దీంతో లక్ష్మమ్మ తల్లి గారి ఇంటికి వెళ్లిపోయింది. పెద్ద మనుషులు ఇద్దరికి నచ్చజెప్పి తిరిగి భర్త దగ్గరికి తీసుకువచ్చారు. మృతుడు మైబు కొడుకు లక్ష్మమ్మతో అక్రమ సంబంధం కొనసాగిస్తుండడంతో విరక్తి చెందిన హనుమన్న తమ్ముడు రాఘవులు ఉరివేసుకొని చనిపోయాడు. ఈ సంఘటన జరగగానే మృతుడు కొడుకును ఊరి నుంచి హైదరాబాద్ కు పంపించారు.
సుమారు పది నెలల క్రితం నుండి రెండు, మూడుసార్లు హనుమన్న కు మృతుడు దానం మైబు కు గొడవ జరిగిందని ఇవన్నీ మనసులో పెట్టుకొని హనుమన్న దానం మైబును ఎలాగైనా చంపించాలని అనుకొని చిన్న రాజమూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ A4 మ్యాదరి చిన్న రాములు సహకారంతో దొడ్డులోని పల్లె గ్రామానికి చెందిన గొల్ల మల్లేష్, గంజి శరత్ ను పరిచయం చేసుకొని మైబును చంపేస్తే ఇద్దరికీ ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తానని సుఫారి కుదిరించుకొని 23. 10. 2025 రాత్రి 9:30 గంటల ప్రాంతంలో అడవి అజీలాపూర్ గ్రామం దగ్గర చిన్న కల్వర్టు వద్ద దానం మైబు మోటార్ సైకిల్ పై వెళ్తుండగా సుపారి తీసుకున్న నిందితులు ఓవర్టేక్ చేసి వారి వద్ద ఉన్న వేటకోడవలతో దాడి చేశారు. మైబు తప్పించుకొని పారి పోతుండగా వెంబడించి పట్టుకొని వేట కొడవళ్ళ తో విచక్షణ రహితంగా దాడి చేయడంతో మైబు అక్కడికక్కడే మరణించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. A3గంజి శరత్ మరొక కేసులో జైల్లో ఉన్నాడని మిగతా ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. హత్య కేసు చేదించడానికి కృషి చేసిన సీఐ రామకృష్ణను, దేవరకద్ర ఎస్సై నాగన్న, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ వెంకటేశ్వర్లు అభినందించారు.






