- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవరకద్ర మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఏకగ్రీవం
దేవరకద్ర మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా జి.ఎస్ దమయంతి, వైస్ చైర్మన్గా యుగంధర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

దిశ, దేవరకద్ర : దేవరకద్ర మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం దేవరకద్ర మున్సిపాలిటీ కేంద్రంలో నిర్వహించిన చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణస్వీకారో త్సవంలో భాగంగా మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా 3వ వార్డు కౌన్సిలర్ జి.ఎస్ దమయంతి, వైస్ చైర్మన్గా 12వ వార్డు కౌన్సిలర్ యుగంధర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వార్డు సభ్యులుగా ప్రమాణస్వీకారం అనంతరం నిర్వహించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కార్యక్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్ లు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవరకద్ర పట్టణ అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతామని, ప్రజలకు పారదర్శక పాలన అందించడమే లక్ష్యమని వారు తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధి, పరిశుభ్రత, తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్, వార్డు సభ్యులకు ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






