తుఫాన్ నష్ట వివరాలు సేకరించాలి :అదనపు కలెక్టర్లు

by Nallavelli.Anjaneyulu |

దిశ, కందనూల్ : మొంథా తుపాను ప్రభావంతో నాగర్ కర్నూల్ జిల్లాలో సంభవించిన నష్టాలను వెంటనే శాఖల వారీగా సేకరించి సమర్పించాలని నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్లు పి.అమరేందర్, దేవ సహాయం ఆయా శాఖల అ

తుఫాన్ నష్ట వివరాలు సేకరించాలి :అదనపు కలెక్టర్లు
X

దిశ, కందనూల్ : మొంథా తుపాను ప్రభావంతో నాగర్ కర్నూల్ జిల్లాలో సంభవించిన నష్టాలను వెంటనే శాఖల వారీగా సేకరించి సమర్పించాలని నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్లు పి.అమరేందర్, దేవ సహాయం ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం వివిధ శాఖల జిల్లా అధికారులతో తుఫాన్ నష్టాల సేకరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు అదనపు కలెక్టర్లు. మండలాల వారీగా నష్టాల వివరాలు వెంటనే పంపాలని సూచించారు. తాత్కాలిక పునరుద్ధరణ పనులు తక్షణమే చేపట్టాలని, శాశ్వత పనుల అంచనాలు ఈరోజు సాయంత్రం లోపు సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఫార్మాట్‌ ప్రకారమే నివేదికలను సమర్పించాలన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంటల వారీగా దెబ్బతిన్న పంటల వివరాలు, పంచాయతీరాజ్, ఆర్అండ్ బీ శాఖలు రోడ్లు, పాఠశాలలు, అంగన్ వాడీలు, భవనాల నష్టాలను ఖచ్చితంగా సేకరించాలని సూచించారు.


పశుసంవర్ధక శాఖ అధికారులు ఆవులు, గేదెలు, మేకలు, గొర్లు, కోళ్ల నష్టాలను స్పష్టంగా నమోదు చేయాలని, గ్రామపంచాయతీలు అంటువ్యాధులు రాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అదనపు కలెక్టర్లు, జిల్లాలో జరిగిన నష్టాలు, చేపట్టిన సహాయక చర్యలను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు, పశుసంవర్ధక శాఖ అధికారి జ్ఞానశేఖర్, పంచాయతీరాజ్ ఇంజనీర్ విజయ్ కుమార్, ఇరిగేషన్ ఈఈ పార్థసారథి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు, శిశు సంక్షేమశాఖ అధికారి రాజేశ్వరి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవికుమార్, సాంఘిక సంక్షేమశాఖ అధికారి ఉమాపతి, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Next Story