- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ముక్కిడిగుండం'లో గిరిజన ఉత్సవాలు ప్రారంభం
దిశ, కొల్లాపూర్ : నల్లమల ప్రాంతం లోని ముక్కిడిగుండం గ్రామంలో తొలి సారిగా మండల స్థాయి రెండు గిరిజన ఉత్సవాలు బుధవారం

దిశ, కొల్లాపూర్ : నల్లమల ప్రాంతం లోని ముక్కిడిగుండం గ్రామంలో తొలి సారిగా మండల స్థాయి రెండు గిరిజన ఉత్సవాలు బుధవారం ప్రారంభయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గిరిజన సంఘం నాయకుడు దేశావత్ వెంకట్ నాయక్ తన సొంత ఖర్చులతో వాలీబాల్ పోటీలను ఏర్పాటు చేశారు. దాదాపు ఇందులో 12 గిరిజన తాండల టీమ్ లు పాల్గొన్నాయి. ఈ సందర్బంగా వెంకట్ నాయక్ మాట్లాడుతూ.. క్రీడలు దేహదారుడ్యంతో పాటు మానసిక ఉ ల్లాసాన్ని ఇ స్తాయన్నారు. దీంతో క్రీడా కారుల మధ్య స్నేహాభావం పెరుగుతుందన్నారు. మొదట టాస్ వేయగా ఎల్లూరు, మొలచింతపల్లి జట్ల మధ్య జరిగిన వాలీ బాల్ పోటీ రసవత్తరం గా సాగింది. ఈ పోటీల్లో విజేతలకు మొదటి బహుమతి రూ, 5వేలు, రెండో బహుమతి రూ, 3వేలు, మూడో బహుమతి రూ, 2వేలు ఇవ్వనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. మండలంలోని గేమ్యా తాండా, సున్నపు తాండా, మొలచింత పల్లి, ముక్కిడి గుండం, ఎల్లూరు, కొల్లాపూర్, తో పాటు పలు గిరిజన తాండల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ డైరెక్టర్ దేశావత్ భోజ్య నాయక్, బాస్కర్ నాయక్ పాల్గొన్నారు.






