- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ భవనం తొలగింపు
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ భవనం తొలగించడానికి రంగం సిద్ధమైంది. 1993 వరకు మీటర్ గేజీ గా ఉన్న రైల్వే ట్రాక్ ను బ్రాడ్ గేజీ గా మార్చినప్పుడు, అప్పటి వరకు

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ భవనం తొలగించడానికి రంగం సిద్ధమైంది. 1993 వరకు మీటర్ గేజీ గా ఉన్న రైల్వే ట్రాక్ ను బ్రాడ్ గేజీ గా మార్చినప్పుడు, అప్పటి వరకు ఉన్న నిజాం గ్యారంటీడ్ రైల్వే లైన్ ఏర్పాటు సమయంలో నిజాం నవాబు కట్టిన పాత భవనం ను కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించారు. అప్పటి నుండి 33 ఏళ్ల పాటు ప్రయాణికులకు సేవలందించిన ఈ భవనం ఇక కనుమరుగవుతుంది. మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డికె అరుణ పట్టుబట్టి 'అమృత్ భారత్ స్టేషన్' పథకం కింద మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ ను భవనం ను ఆధునికీకరణ కింద ఎంపిక చేయించి నిధులను మంజూరు చేయించారు. ఇప్పుడు ఉన్న పాత భవనాన్ని పూర్తిగా తొలగించి కొత్త భవనాన్ని నిర్మించడానికి పనులు చురుగ్గా సాగుతున్నాయి.
బుకింగ్ కౌటర్, విచారణ కేంద్రాలను మార్చాం : రైల్వే కమర్షియల్ ఇన్ స్పెక్టర్ S. A ముక్తార్
ప్రస్తుతం రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న బుకింగ్ కౌటర్, విచారణ కేంద్రాలను స్టేషన్ కు కుడివైపు భాగంలో ఉన్న రైల్వే రక్షక దళం(ఆర్పీఎఫ్) పోలీస్ ఠాణా వెనకాల ఉన్న తాత్కాలిక భవనంలోకి, రిజర్వేషన్ కౌంటర్ ను ఎడమవైపు ఉన్న రైల్వే మొయిల్ కార్యాలయం భవనంలో ఎస్బీఐ ఏటిఎం ప్రక్కన ఏర్పాటు చేశాం. మార్చిన ఈ కౌంటర్లు ఆదివారం నుండి పనిచేస్తాయి. నూతన భవనం నిర్మాణానికి 8 నెలలు గడువు ఇచ్చారు. నూతన భవనం పూర్తి అయ్యే వరకు ఈ తాత్కాలిక కౌంటర్లలోనే సేవలు కొనసాగుతాయి.ప్రయాణికులు సహకరించాలి.






