- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాస్పిటల్ కు తరలిస్తుండగా అంబులెన్స్ లో ప్రసవం
దిశ, పెద్ద కొత్త పల్లి : ప్రసవ వేదనలో ఉన్న గర్భిణీ ని హాస్పిటల్ కు అంబులెన్సు లో తరలిస్తుండగా.. మార్గ మధ్యలో మగ శిశువుకు జన్మనిచ్చింది.

దిశ, పెద్ద కొత్త పల్లి : ప్రసవ వేదనలో ఉన్న గర్భిణీ ని హాస్పిటల్ కు అంబులెన్సు లో తరలిస్తుండగా.. మార్గ మధ్యలో మగ శిశువుకు జన్మనిచ్చింది. మంగళవారం సాయంత్రం పెద్ద కొత్తపల్లి మండలం చిన్న కార్పాముల గ్రామానికి చెందిన మంజుల పురిటి నొప్పులు విపరీతంగా రావడంతో 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అక్కడ నుంచి తీసుకొస్తుండగా.. మార్గమధ్యలోకి రాగానే పురిటి నొప్పులు అధికంగా రావడంతో డాక్టర్ శివ సహాయంతో అంబులెన్స్ లో పండంటి మగ బిడ్డకు పురుడు పోశారు. ఈఎంటీ మల్లికార్జున్ పైలెట్ శేఖర్, డెలివరీ ఆ నంతరం నాగర్ కర్నూల్ జిల్లా హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయితే ఆ మహిళ కు డెలివరీ కి ఇంకా కొన్ని రోజులు ఉందంటూ ఆమె భర్త టూర్లు వెళ్లారు. ఇంటి దగ్గర ఎవరు మగవారు లేకున్నా 108 సిబ్బంది మీద నమ్మకంతో కాల్ చేశారు. అంబులెన్సు సిబ్బంది వచ్చి మాకు ధైర్యం నింపి డెలివరీ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు.






