- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుక్కల దాడిలో రెండు జింకలు మృతి
మండల కేంద్రంలోని సోలార్ రోడ్డులో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడికి గురైన రెండు జింక లు మృతి చెందాయి.

దిశ, ఊట్కూర్: మండల కేంద్రంలోని సోలార్ రోడ్డులో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడికి గురైన రెండు జింకలు మృతి చెందాయి. స్థానికులు, ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పొలం పనులు ముగించుకుని వస్తున్న స్థానికులు ఎ. నాగప్ప, కావలి సుధాకర్, అశోక్, నక్క భీమప్ప జింకలను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఒక జింక తీవ్రంగా గాయపడటంతో ప్రాణాలు కోల్పోయింది. మరో జింకను స్థానికులు సురక్షితంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మండలంలోని పలు గ్రామాల్లో వేపుగా ఉన్న చెట్లను తొలగించడం, చెరువుల సమీప ప్రాంతాల్లో సాగు విస్తరించడంతో అడవి జంతువుల ఆవాసాలు తగ్గుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో చెట్ల మధ్య సంచరించే జింకలు, నెమళ్లు తరచూ పొలాల వైపు వస్తుండగా, ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని వీధి కుక్కలు వాటిపై దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అడవి జంతువుల రక్షణకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు..






