గొల్ల‌ప‌ల్లి చెరువులో గ‌ల్లంత‌యిన ఇద్ద‌రు స్నేహితుల మృత‌దేహాలు ల‌భ్యం

by Nallavelli.Anjaneyulu |

జడ్చర్ల మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో గత మూడు రోజుల క్రితం చెరువులో ఈత కొట్టడానికి అని వెళ్లి గల్లంతైన నవీన్, యాదగిరి మృతదేహాలు మంగళవారం లభ్యమయ్యాయి.

గొల్ల‌ప‌ల్లి చెరువులో గ‌ల్లంత‌యిన ఇద్ద‌రు స్నేహితుల మృత‌దేహాలు ల‌భ్యం
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో గత మూడు రోజుల క్రితం చెరువులో ఈత కొట్టడానికి అని వెళ్లి గల్లంతైన నవీన్, యాదగిరి మృతదేహాలు మంగళవారం లభ్యమయ్యాయి. గత మూడు రోజుల నుంచి ఇద్దరు గల్లంతైన వారి మృతదేహాల కొరకు ఎస్డిఆర్ఎఫ్, పోలీస్ సిబ్బంది తోపాటు ప్రత్యేక కెమెరాలతో గాలింపు చేపట్టగా ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం ప్రత్యేక కెమెరాలతో గుర్తించి చెరువులో నుంచి నవీన్, యాదగిరి మృతదేహాలను బయటికి తీశారు. ఘటన స్థలం వద్ద ఉండి పరిస్థితిని సమీక్షించిన మహబూబ్ న‌గ‌ర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, పట్టణ సీఐ కమలాకర్ ఎస్డి ఆర్ఎఫ్ డీఎస్పీ ఘటన స్థలం నుంచి జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి మృత‌దేహాల‌ను తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. గత మూడు రోజులుగా ఘటన స్థలం వద్దే ఉండి గాలింపు చర్యలు చేపట్టిన తెలంగాణ ఫైర్ సిబ్బందితోపాటు, ఎస్సై జయప్రసాద్ ని పోలీస్ సిబ్బందిని డీఎస్పీ వెంకటేశ్వర్లు అభినందించారు.

Next Story