డీసీసీబీ అభివృద్ధి ప్రణాళిక లక్ష్యాలను సాధించాలి : కలెక్టర్ విజయేందిర బోయి

by Nallavelli.Anjaneyulu |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అభివృద్ధి ప్రణాళిక లక్ష్యాలను సాధించాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పర్సన్ ఇన్ చార్జి, కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు.

డీసీసీబీ అభివృద్ధి ప్రణాళిక లక్ష్యాలను సాధించాలి :   కలెక్టర్ విజయేందిర బోయి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డిసిసిబీ)అభివృద్ధి ప్రణాళిక లక్ష్యాలను సాధించాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పర్సన్ ఇన్ చార్జి, కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం మహబూబ్ నగర్ డీసీసీబీ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన డీఎల్‌ఎమ్‌ఆర్‌సీ సమావేశానికి ఆమె హాజరై బ్యాంకు అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక ముఖ్య అజెండా అంశాలపై సమగ్రంగా సమీక్షించి మాట్లాడారు. స్వయం సహాయక సంఘాలను అనుసంధానం చేయాలని, బ్యాంక్ డీఏపీ లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, అసమతుల్యత లను తగ్గించేందుకు పీఏసీఎస్ బ్యాంకులు, జిల్లా సహకార అధికారి(డిసిఓ)పరస్పరం సమన్వయంతో నెలవారీ సమీక్షలు నిర్వహిస్తూ పనిచేయాలని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ డీఏపీ లో సూచించిన లక్ష్యాలను సాధించి, సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇంచార్జీ కె.రవికాంత్ రెడ్డి, జిల్లా సహకార ఆడిట్ అధికారి టైటస్ పాల్, డీసీసీబీ నోడల్ ఆఫీసర్ నిర్మలాదేవి, డీజీఎం, టీజీసీఏబీ, డీడీఎం, నాబార్డ్ మనోహర్ రెడ్డి, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.

Next Story