వేదవిద్య కోసం గురుకులాలను స్థాపించింది దయానంద సరస్వతి

by Nallavelli.Anjaneyulu |

స్త్రీ విద్యను ప్రోత్సహించి, వేద విద్య కోసం గురుకులాలు, పాఠశాలలను మొదటగా నెలకొల్పింది మహర్షి దయానంద సరస్వతి అని ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత అధ్యాపకుడు ఆచార్య మసన చెన్నప్ప అన్నారు.

వేదవిద్య కోసం గురుకులాలను స్థాపించింది దయానంద సరస్వతి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : స్త్రీ విద్యను ప్రోత్సహించి, వేద విద్య కోసం గురుకులాలు, పాఠశాలలను మొదటగా నెలకొల్పింది మహర్షి దయానంద సరస్వతి అని ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత అధ్యాపకుడు ఆచార్య మసన చెన్నప్ప అన్నారు. ఆదివారం స్థానిక సీనియర్ సిటిజన్ ఫోరం కార్యాలయంలో అగ్నిముని, వానప్రస్ధి తూము సుభాష్ ఆర్య ఏర్పాటు చేసిన మహర్షి దయానంద సరస్వతి ద్విశతాబ్ధి సంవత్సర జయంతోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన, వైదిక గాయకురాలు హేమలత ఆర్య లు ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రసంగించారు. విగ్రహారాధన, బహు దేవతారాధన వేదాలలో లేవని నిరూపిస్తూ, ఏకేశ్వరపాసను బోధించారని, ఆయన రచించిన 'సత్యార్ధ ప్రకాశం' లో హిందూ దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఆర్య సమాజం అనేది మతం కాదని, అది విద్య,బుద్ధి, జ్ఞానం, సంస్కారం లాంటివి నేర్పుతుందన్నారు. అంతకుముందు యాగం నిర్వహించిన వైదిక గాయకురాలు హేమలత ఆర్య తన గానంతో అలరించారు. ఈ కార్యక్రమంలో వి.అనంతరెడ్డి, కిష్టయ్య, రాజసింహుడు పాల్గొన్నారు.

Next Story