- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెట్లకు ఏది రక్షణ..?
రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ వందల కోట్ల రూపాయల వ్యయంతో హరిత హారం కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. లక్ష్యాలను కొందరు దళారులు చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికి పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

దిశ, వీపనగండ్ల : రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ వందల కోట్ల రూపాయల వ్యయంతో హరిత హారం కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. లక్ష్యాలను కొందరు దళారులు చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికి పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల లో తాజాగా వ్యవసాయ భూముల్లో పెరిగిన చెట్లను నరికివేసి, వాటి కలపను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న దృశ్యాలు కనిపించాయి. చెట్లు కేవలం నీడనే కాకుండా నేల సారాన్ని పెంచడంలో, వర్షపాతం సమతుల్యతలో, గాలి కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో చెట్ల నరికివేత దీర్ఘకాలంలో వ్యవసాయానికే నష్టం కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. స్థానిక ప్రజలు మరియు పర్యావరణ ప్రేమికులు చెబుతున్నదేమిటంటే, ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి చెట్లు నాటిస్తుంటే, మరోవైపు వాటిని నరికి వేయడం వల్ల హరిత హారం లక్ష్యం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి చెట్ల అక్రమ నరికివేతపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






