ఉపాధ్యాయులు జీతాల్లో కోత‌లు విధించ‌డం స‌మంజ‌సం కాదు : త‌ప‌స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి

by Ratna Kumari |

జీతాల నుంచి హెల్త్ కార్డు ప్రీమియం పేరుతో కోతలు విధించడం సమంజసం కాదని తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఉపాధ్యాయులు జీతాల్లో కోత‌లు విధించ‌డం స‌మంజ‌సం కాదు : త‌ప‌స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి
X

దిశ‌, జోగులాంబ ప్ర‌తినిధి : జీతాల నుంచి హెల్త్ కార్డు ప్రీమియం పేరుతో కోతలు విధించడం సమంజసం కాదని తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హెల్త్ కార్డులకు సంబంధించిన విధి విధానాలు, ప్రయోజనాలు, పరిమితులు, గుర్తింపు పొందిన ఆసుపత్రుల వివరాలు వెల్లడించకుండా, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా ప్రీమియం వసూలు చేయడం సరైన విధానం కాదన్నారు. అధికారికంగా హెల్త్ కార్డులు జారీ చేయకుండానే, పథకంపై పూర్తి సమాచారం ఇవ్వకుండానే మే నెల జీతాల్లో కోత విధించడం ఉపాధ్యాయులను మోసగించడమేనని ఆయన ఆరోపించారు. హెల్త్ కార్డు కవరేజీ ఎంత, ఏయే ఆసుపత్రుల్లో సేవలు అందుబాటులో ఉంటాయనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పథకం ఇష్టం లేని ఉద్యోగులకు మినహాయింపు (ఎగ్జెంప్షన్) కల్పించాలని, ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తల విషయంలో ఒకరి జీతం నుంచే ప్రీమియం వసూలు చేయాలని ప్రభుత్వం పరిశీలించాలని శ్రీధర్ రెడ్డి కోరారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు.

Next Story