- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్యాంకులో తప్పని తిప్పలు
మండల కేంద్రంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో సరిపడా సిబ్బంది లేక ఖాతాదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

దిశ, వంగూర్ : మండల కేంద్రంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో సరిపడా సిబ్బంది లేక ఖాతాదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మండలం మొత్తానికి ఏకైక బ్యాంకుగా ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో వేల కొద్ది ఖాతాలు ఉన్నాయి. ప్రతిరోజు వందల కొద్ది రైతులు, సాధారణ పౌరులు బ్యాంకు సేవలు వినియోగించుకుంటారు. ఇలాంటి బ్యాంకులో సరిపడ సిబ్బంది లేకపోవడంతో విపరీతమైన రద్దీ ఏర్పడి పది నిమిషాల్లో జరగాల్సిన పని పూర్తికావడానికి రోజులు పడుతున్నదని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయంపై దిశ బ్యాంకు మేనేజర్ సుదర్శన్ కలిసి వివరణ కోరగా అతను ఇష్టానుసారంగా మాట్లాడుతూ సరిపడ సిబ్బంది హైదరాబాదులో ఉన్నారని మీరు వెళ్లి తీసుకురండి అని దురుసుగా మాట్లాడడం ఆశ్చర్యానికి లోని తీసింది. ప్రజాసమస్యల పై ప్రశ్నిస్తే సహనం కోల్పోయి మాట్లాడడం ఎంతవరకు సమంజసం మని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.






