దారుణం.. మహిళ కాళ్లపై నుంచి వెళ్లిన ఆర్టీసీ బస్సు

by Naveena |

మహిళ కాళ్లపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది.

దారుణం.. మహిళ కాళ్లపై నుంచి వెళ్లిన ఆర్టీసీ బస్సు
X

దిశ ,నాగర్ కర్నూల్ : మహిళ కాళ్లపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...l కోడేరు మండలానికి చెందిన బాలకృష్ణమ్మ, తన భర్తతో కలిసి నాగర్ కర్నూల్ కి వచ్చింది. అక్కడి నుంచి తన చిన్న కుమార్తెను చూడడానికి మహబూబ్ నగర్ బస్సు ఎక్కింది. అయితే తన భర్త బస్సులో కనిపించకపోవడంతో.. కిందికి దిగుతున్న క్రమంలో ఆమె కాలుపై నుంచి బస్సు టైర్ వెళ్ళింది. దీంతో తీవ్ర గాయాలు కావడంతో ట్రాఫిక్ పోలీసుల సహాయంతో జిల్లా ఆసుపత్రిలో చేరింది. జిల్లా ఆస్పత్రిలో సిమెంట్ పట్టి వేయించుకొని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్టు సమాచారం .

Next Story