- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేరస్తులు చట్టం నుంచి తప్పించుకోలేరు : ఎస్పీ రావుల గిరిధర్
దిశ, వనపర్తి : నేరం చేసిన నేరస్తులు చట్టం నుంచి తప్పించుకోలేరని వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ

దిశ, వనపర్తి : నేరం చేసిన నేరస్తులు చట్టం నుంచి తప్పించుకోలేరని వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రావుల గిరిధర్ మిస్సింగ్ మర్డర్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్ లో బిజ్జి చెన్నమ్మ తన సోదరుడు కేకుల కురుమూర్తి అక్టోబర్ 25వ తేదీ నుంచి కనిపించడం లేదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో సీఐ కృష్ణయ్య టౌన్ ఎస్సై హరిప్రసాద్, చిన్నంబా ఎస్సై జగన్ మోహన్,వి.ఆర్ ఎస్.ఐ రాము,టౌన్ సెకండ్ ఎస్సై శశిధర్ కేసు దర్యాప్తు ప్రారంభించారు.ఈ క్రమంలో భర్త తప్పిపోయాడని భార్య నాగమణి ఫిర్యాదు చేయాల్సింది పోయి నాగర్ కర్నూల్ లో నివాసం ఉంటున్న కురుమూర్తి సోదరి చెన్నమ్మ ఫిర్యాదు ఇవ్వడంపై పోలీసులకు అనుమానం కలగడంతో మిస్సింగ్ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.
కేకుల మన్నెమ్మ (మృతుని భార్య) అదుపులో తీసుకొని విచారించగా..తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ప్రియుడు బుల్లెట్ శ్రీకాంత్ అలయాజ్ నందిమల్ల శ్రీకాంత్ తో కలిసి భర్త కురమూర్తిని టవల్ తో బిగించి ఊపిరాడకుండా హత్యకు పాల్పడ్డారని నేరం ఒప్పుకుంది.నిందితులను ఇద్దరిని అదుపులోతీసుకొని విచారించగా 25 మధ్యాహ్నం తాము హత్య చేసి, వాహనంలో శ్రీశైలం ప్రాజెక్టు పవర్ సమీపంలో కృష్ణ నీటిలో మృతదేహాన్ని పడేసామని ఒప్పుకున్నారు. అక్టోబర్ 2న శ్రీశైలం కాలువ నీటిలో మత్స్యకారుల వలలకు గుర్తు తెలియని మృతదేహం చిక్కిందన్న సమాచారం అందించారు.దర్యాప్తు బృందం సంఘటన స్థలం చేరుకొని, కుటుంబ సభ్యులు తెలిపిన ఆనవాళ్ళ ప్రకారం ఆ మృతదేహం కేకుల కురుమూర్తిగా గుర్తించారు. నేరం ఒప్పుకున్నా వనపర్తి పట్టణానికి చెందిన నిందితులు మృతుడి భార్య కేకుల నాగమణి, ప్రియుడు నందిమల్ల శ్రీకాంత్ ను రిమాండ్ కు తరలించామని ఎస్పీ గిరిధర్ తెలిపారు.మర్డర్ కేసు ను చేదించిన ధర్యాప్తు బృందం అధికారులను, కానిస్టేబుల్ నవీన్ కుమార్ గౌడ్, శివలను ఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించారు.






