- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గత సంవత్సరం కంటే నేరాలు తగ్గాయి : ఎస్పీ జానకి
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఈ సంవత్సరాంతం ప్రజా భద్రతే లక్ష్యంగా పనిచేసి, సమర్థవంతమైన పని తీరు కనబరచి ఎన్నో

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఈ సంవత్సరాంతం ప్రజా భద్రతే లక్ష్యంగా పనిచేసి, సమర్థవంతమైన పని తీరు కనబరచి ఎన్నో సవాళ్లను అధిగమించి నేరాలను తగ్గించామని ఎస్పీ డి.జానకి అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె 2025 సంవత్సరం కు సంబంధించిన వార్షిక నివేదికను వివరించారు. ఈ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు జిల్లాలో శాంతి భద్రతలు,నేర నియంత్రణ, మహిళలు/బాలికల భద్రత, రోడ్డు భద్రత, సైబర్ నేరాల నియంత్రణలో సాధించిన ముఖ్యమైన విజయాలను ఆమె వివరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కఠిన భద్రతా చర్యలు చేపట్టి, ఎన్నికల తనిఖీల్లో 11,08,250 నగదు, 6,93,858 రూపాయల విలువ గల 1050.23 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని, అలాగే ₹ 7200 విలువైన ఉచితాల పంపిణీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన 9 కేసుల నమోదు చేసి, 458 మెమోలు జారీ చేసి, 640 మందిని బౌండ్ ఓవర్ చేసినట్లు, 73 నాకాబందీ ఆపరేషన్లతో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. నేర నియంత్రణలో భాగంగా, 2024 లో 5937 కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం 5662 కేసులు మాత్రమే నమోదై, నేరాలు 5 శాతం తగ్గినట్లు తెలిపారు.
మహిళలు/బాలికల భద్రత కై ఏర్పాటైన షీ టీమ్స్, పోలీస్ సురక్ష బృందాలు, భరోసా కేంద్రం ద్వారా పాఠశాలు, కళాశాలలో అవగాహన కల్పించడం ద్వారా 168 కేసులు నమోదు కాగా, అందులోని 119 కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించామని, 2024 లో మొత్తం రోడ్డు ప్రమాదాలు 1055 కాగా, 2025 లో 1103 కి పెరిగినట్లు, గత సంవత్సరం 2578 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం కఠిన చర్యలు చేపట్టి 3245 కేసులు నమోదు అయ్యాయని, వీటిపై 2024 లో ₹ 28,94,085 జరిమానా విధించగా, 2025 లో ₹ 32,59,386 జరిమానా విధించినట్లు, 2024 లో 5 గురిని జైలుకు పంపగా 2025 లో 21 మంది జైలు శిక్ష విధించబడ్డాయని ఎస్పీ వివరించారు. 2025 లో 1475 సైబర్ నేరాల దరఖాస్తులు స్వీకరించి 220 కేసులు నమోదు చేయగా, అందులో ₹ 2,18,17,758 నష్టం జరుగగా, అందులో ₹ 1,98,79,364 లను బాధితులకు తిరిగి అందించామని, ఇది గత సంవత్సరం కంటే 125 కేసుల్లో ఎక్కువ రికవరీ చేసిన సంతృప్తి కలిగిందని ఎస్పీ జానకి తెలిపారు. ఇక పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు సిఐఆర్ పోర్టల్ ద్వారా 1173 మొబైల్ ఫోన్లను తిరిగి అప్పగించామని, ఆస్తి నేరాల రికవరీ 29.85 శాతం నుంచి 46.89 శాతానికి పెరిగిందని, 2025 లో 327 ఆస్తి నేర కేసులు నమోదు కాగా, 215 మందిని అరెస్టు చేసి 99,83,318 విలువైన ఆస్తులను తిరిగి స్వాధినపరచామని అన్నారు.
గంజాయి అక్రమ రవాణా పై 32 మందిని అరెస్టు చేసి,11,850 కిలోల గంజాయి, 22 కిలోల ఆల్ఫారాజోలం(₹ 15,23,125 విలువ) స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాల ద్వారా ఈ సంవత్సరం 1059 మంది బాలురు, 17 మంది బాలికలను బాలకార్మిక స్థితి నుంచి విముక్తి చేసి వారి కుటుంబాలకు అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఈ సంవత్సరం 1608 ఎఫ్ఐఆర్ కేసులు, 2739 డిడి అండ్ మోటార్ వాహన చట్టం కేసులతో సహా మొత్తం 10,431 కేసులు పరిష్కరించబడి పోలీస్ శాఖ ప్రతిభను చాటుకున్నామని సంతోషం వ్యక్తంచేశారు.అలాగే పోలీస్ క్రీడల్లో జిల్లా పోలీస్ శాఖ అసమాన ప్రతిభ కనబరిచి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నామని, యోగా లో ఏఎస్ఐ వనజా రెడ్డి జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించగా, మహిళా కానిస్టేబుల్ రాధిక 74 వ ఆల్ ఇండియా పోలీస్ క్లస్టర్ గేమ్స్ లో ఆర్మ్ రెజ్లింగ్ లో పథకం సాధించి దేశంలో గుర్తింపు సాధించి జిల్లా కే గర్వకారణం గా నిలిచామన్నారు. ఇవన్నీ తమ సిబ్బంది సహకారం, ప్రజల మద్దతు తో సాధించినట్లు ఎస్పీ జానకి తెలిపారు.






