రోడ్డును క‌ప్పేస్తున్న పిచ్చి మొక్క‌లు.. వాహ‌న‌దారుల ఇక్క‌ట్లు..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, హన్వాడ : హన్వాడ - వేపూర్ ప్రధాన రహదారికి ఇరువైపులా మొలిచిన పిచ్చిమొక్కలు రోజు రోజుకూ రోడ్డు పైకి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

రోడ్డును క‌ప్పేస్తున్న పిచ్చి మొక్క‌లు.. వాహ‌న‌దారుల ఇక్క‌ట్లు..!
X

దిశ, హన్వాడ : హన్వాడ - వేపూర్ ప్రధాన రహదారికి ఇరువైపులా మొలిచిన పిచ్చిమొక్కలు రోజు రోజుకూ రోడ్డు పైకి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో ముందు వెళుతున్న వాహనాన్ని దాటి వెళ్లాలంటే వారికి గగనమే అవుతోంది. హన్వాడ - వేపూర్ ప్రధాన రహదారికి ఇరు వైపులా పిచ్చిమొక్కలు పెరిగి రోడ్డుపైకి వ్యాపిస్తున్నాయి. రోడ్డు మలుపుల వద్ద ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఎదురుగా వస్తున్న వాహనాలు కనబడటం లేదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు గుంపుగా ఉండటంతో రోడ్డు కిందినుంచి ప‌శువులు, మనుషులు వచ్చేది కూడా కనబడటం లేదని అలాంటి సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. గతంలో వేపూర్ గ్రామ సమీపంలో ఓ మహిళ అకస్మాత్తుగా రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీ కొని మృతి చెందిందని స్థానికులు తెలిపారు. ఉదయం సమయంలోనే ఇలా ఉంటే ఇక రాత్రి సమయాల్లో మరింత ఇబ్బందికరంగా ఉంటుందని మాదారం, మునిమోక్షం గ్రామాల దగ్గర రాత్రి వేళల్లో రోడ్డుకు ఇరువైపులా ఉండే పిచ్చిమొక్కల పొదలలో నుంచి అడవి పందులు అక‌స్మాత్తుగా రోడ్డు పైకి రావడంతో ప్రమాదాలబారిన పడుతున్నామని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించే కంటే.. ముందే చర్యలు తీసుకుని మొక్కలను తొలిగించాలని అధికారులను వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.

Next Story