స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో సీపీఎం పోటీ

by Nallavelli.Anjaneyulu |

దిశ, కొల్లాపూర్ : నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో స్థానిక ఎన్నిక‌ల్లో 30 ఎంపీటీసీ, 7 జ‌డ్పీటీసీ స్థానాల‌కు సీపీఎం పోటీ చేస్తుంద‌ని నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కార్య‌ద‌ర్శి

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో సీపీఎం పోటీ
X

దిశ, కొల్లాపూర్ : నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో స్థానిక ఎన్నిక‌ల్లో 30 ఎంపీటీసీ, 7 జ‌డ్పీటీసీ స్థానాల‌కు సీపీఎం పోటీ చేస్తుంద‌ని నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కార్య‌ద‌ర్శి వ‌ర్దం ప‌ర్వతాలు పేర్కొన్నారు. ఆదివారం కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామంలో కార్య‌క‌ర్త‌ల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు కార్య‌క‌ర్త‌లు సిద్ధం కావాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై నిరంత‌రం పోరాడుతున్న ఎర్ర జెండాకు ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని.. పార్టీ అభ్య‌ర్థుల‌ను గెలిపించేందుకు కృషి చేయాల‌ని కోరారు.

ప్రశ్నించే ఎర్రజెండా నాయకులను గెలిపించుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు . నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీ లేని పోరాటం నిర్వహిస్తున్న సీపీఎం కు మద్దతు తెలిపి అత్యధిక స్థానాలను గెలిపించాలని పర్వతాలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. సమావేశంలో మండల కార్యదర్శి బి శివవర్మ,జిల్లా కమిటీ సభ్యులు తారా సింగ్, శాఖా కార్యదర్శులు అశోక్, బాలు నాయక్, నాయకులు బాల పీర్, కృష్ణయ్య, కాశీం, శివకుమార్, భాష,సాయి కృష్ణ అంజి, వెంకటేష్ పాల్గొన్నారు.

Next Story