మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో సీపీఎం అభ్యుర్థుల‌ను గెలిపించాలి

by Ratna Kumari |

వనపర్తి జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జి. బాలస్వామి అధ్యక్షతన సీపీఎం వనపర్తి పట్టణ కమిటీ సమావేశం నిర్వ‌హించారు.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో సీపీఎం అభ్యుర్థుల‌ను గెలిపించాలి
X

దిశ, వనపర్తి టౌన్ : వనపర్తి జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జి. బాలస్వామి అధ్యక్షతన సీపీఎం వనపర్తి పట్టణ కమిటీ సమావేశం నిర్వ‌హించారు. ముఖ్య అతిథిగా సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బలమున్న స్థానాల్లో సీపీఎం అభ్యర్థులు పోటీ చేస్తారని, ప్రజలు నీతిగా, నిజాయితీగా పనిచేసే సీపీఎం అభ్యర్థులకు సుత్తి కొడ‌వ‌రి స్టార్ గుర్తు పై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఎం పార్టీని రాబోయే మున్సిపల్ ఎన్నికలలో వార్డు కౌన్సిలర్లుగా ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. పట్టణాలలో నివాస ప్రాంత సమస్యలపై పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని నిరంతరం కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు తదితర ప్రజా సమస్యలపై సీపీఎం పని చేస్తుందని వార్డుల్లో ఉండే డ్రైనేజీలు, నీటి సమస్య, విద్యుత్తు సమస్య, రోడ్లు, పార్కులు, వార్డుల అభివృద్ధి, పట్టణ అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసేందుకు సీపీఎం అభ్యర్థులకు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేసి వేయించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నేడు రాజకీయాలను వ్యాపారంగా మార్చారని.. డబ్బులు, మద్యం తదితర తాత్కాలిక ప్రయోజనాలను చూపెట్టి ఓట్లు తీసుకొని అభివృద్ధిని మరిచే రాజకీయాలు నేడు ఉన్నాయని నీతి, నిజాయితీతో ప్రజల కోసం పాటుపడుతున్నసీపీఎం అభ్యర్థులను గెలిపించాలని, ప్రజా గొంతుకగా మున్సిపాలిటీలలో పనిచేయడానికి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీపీఎం వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి. జబ్బార్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి. బాల్ రెడ్డి, ఎమ్.రాజు, ఏ.లక్ష్మి, సిపిఎం వనపర్తి పట్టణ కార్యదర్శి ఎం. పరమేశ్వర చారి, పట్టణ నాయకులు డి. కురుమయ్య, ఏ. రమేష్, జి.గట్టయ్య, బీసన్న, గంధం మదన్, జి బాలరాజు, రాబర్ట్, సాయి లీల, ఉమా పాల్గొన్నారు.

Next Story