- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతరాలు లేని సమాజ స్థాపనే సీపీఐ ధ్యేయం : సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్
అంతరాలు లేని సమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా పని చేస్తున్న ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ స్పష్టం చేశారు.

దిశ, పెంట్లవెల్లి : అంతరాలు లేని సమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా పని చేస్తున్న ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ స్పష్టం చేశారు. భారత దేశంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విప్లవ పార్టీ కూడా సీపీఐ అని ఆయన పేర్కొన్నారు.పెంట్లవెల్లి మండల కేంద్రంలో ఆదివారం ఇంటింటికి సీపీఐ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సమాజంలో మనుషుల మధ్య విభజన రేఖలు గీసి కులం మతం, ప్రాంతం, ఆడ, మగ అనే తేడాతో విభజనలు చేస్తున్నారని, ఇది మానవ సమాజానికి మంచిది కాదని సీపీఐ భావిస్తుందన్నారు. సమాజంలో ప్రజల పట్ల ఉన్న వివక్షత పోవాలని, మనుషులంతా సమానమైన ఉన్నతమైన వ్యవస్థ రావాలని ఫయాజ్ పిలుపునిచ్చారు.
దశాబ్దాలుగా గ్రామాల్లో పట్టణాల్లో పేరుకుపోయిన ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నది సీపీఐ అని ఆయన గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర ఉద్యమం నుంచి మొదలుకొని తెలంగాణ సాయుధ పోరాటంలో ఐదు వేల మంది అమరవీరుల ప్రాణ తర్పణ ఇచ్చిన ఘన చరిత్ర కలిగిన సీపీఐ అన్నారు. ప్రజల కోసం ప్రజల మధ్యనే పని చేసే సీపీఐ పార్టీని బలపరిచి ముందుకు నడిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈనెల 1న ప్రారంభమైన ఇంటింటికి సీపీఐ కార్యక్రమానికి జిల్లాలో ప్రజల నుంచి అపురూపమైన స్పందన లభిస్తుందని.. పెంట్లవెల్లిలో కూడా ప్రజల నుంచి మంచి స్పందన కనబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు మాజీ సర్పంచ్ ఆర్ ఇంద్రమ్మ సీపీఐ జిల్లా సమితి సభ్యులు తుమ్మల శివుడు, తప్పెట కిరణ్ కుమార్, పెంట్లవెల్లి మండల కార్యదర్శి దేవ సహాయం, సహాయ కార్యదర్శి నిరంజన్ నాయుడు, కొల్లాపూర్ పట్టణ కార్యదర్శి ఎండీ యూసుఫ్, సహాయ కార్యదర్శి రమణ, ఏఐటీయూసీ నాయకులు చాపల శేఖర్, బి.వరలక్ష్మి కమల, హమాలి యూనియన్ నాయకులు సత్యం, రామకృష్ణ శివ పాల్గొన్నారు.






