నిజాయితికి నిద‌ర్శ‌నంగా నిలిచిన కోర్టు కానిస్టేబుళ్లు

by Ratna Kumari |

కోస్గి పట్టణంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహ వేడుకలో ఒక మహిళకు చెందిన మూడు తులాల బంగారు నాను కనిపించకుండా పోయింది.

నిజాయితికి నిద‌ర్శ‌నంగా నిలిచిన కోర్టు కానిస్టేబుళ్లు
X

దిశ‌, కోస్గి : కోస్గి పట్టణంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహ వేడుకలో ఒక మహిళకు చెందిన మూడు తులాల బంగారు నాను కనిపించకుండా పోయింది. అదే సమయంలో పెళ్లికి హాజరైన దామరగిద్ద కోర్టు కానిస్టేబుల్ ఎల్లప్ప, మద్దూరు కోర్టు కానిస్టేబుల్ చంద్రశేఖర్, కోస్గి కోర్టు కానిస్టేబుల్ తనుజ్‌లకు ఆ బంగారు నాను లభించింది. వారు వెంటనే బాధ్యతాయుతంగా వ్యవహరించి పెళ్లికొడుకుకు సమాచారం అందించడంతో పాటు కోస్గి పోలీస్ స్టేషన్‌కు విషయాన్ని తెలియజేశారు. అనంతరం పోలీసులు విచారణ చేపట్టి, ఆ బంగారు నాను గుండుమల్ మండలం భక్తిమల్ల గ్రామానికి చెందిన గుజ్జ చెన్నమ్మ w/o వెంకటయ్యదిగా గుర్తించారు. అనంతరం ఆమెకు మూడు తులాల బంగారు నాను భద్రంగా అప్పగించారు అని కోస్గి ఎస్సై బాలరాజు తెలిపారు. ఈ సందర్భంగా భక్తి మల్ల సర్పంచ్ జ్యోతి శ్రీకాంత్‌తో పాటు గుజ్జ చెన్నమ్మ దంపతులు పోలీసు సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పెళ్లి వేడుకలో పోగొట్టుకున్న బంగారం తిరిగి దొరకడం చాలా ఆనందంగా ఉందని, పోలీసులు నిజాయితీతో వ్యవహరించడంతో తమ బంగారం తిరిగి తమకు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులను భద్రంగా తిరిగి అప్పగిస్తూ నిజాయితీతో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని స్థానికులు అభినందించారు.

Next Story