మృతురాలి కుటుంబాన్ని పరామర్శ : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సాగర్

by Ratna Kumari |

బొల్లారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, సీపీఎం జిల్లా నాయకులు ఎం. కృష్ణయ్య సతీమణి, పార్టీ సభ్యురాలు కామ్రేడ్ అరుణ అనారోగ్యంతో మృతి చెందారు.

మృతురాలి కుటుంబాన్ని పరామర్శ :  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సాగర్
X

దిశ, వీపనగండ్ల : బొల్లారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, సీపీఎం జిల్లా నాయకులు ఎం. కృష్ణయ్య సతీమణి, పార్టీ సభ్యురాలు కామ్రేడ్ అరుణ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. శనివారం అంత్యక్రియలకు హాజరు కాలేకపోయిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి. సాగర్ ఆదివారం బొల్లారం గ్రామానికి చేరుకుని మృతురాలి భర్తను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం కోల్పోకుండా ఉండాలని సూచించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు నాగిరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి. బాల్ రెడ్డి, ఎం. రాజు, గ్రామ పార్టీ నాయకులు వి. కృష్ణయ్య, బాలగౌడ్, వెంకటస్వామి, నాగరాజు, ఈశ్వరయ్య పాల్గొన్నారు.

Next Story