- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కలెక్టరేట్ ఎదురుగా హోటల్‌లో కలుషిత భోజనం
దిశ, గద్వాల క్రైమ్ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కొత్త హౌసింగ్ బోర్డు సమీపంలో కలెక్టరేట్ ఎదురుగా ఉన్న భాగ్యలక్ష్మి భోజన హోటల్ లో కలుషిత భోజనం అందిస్తూ ప్రజల ప్రాణాలతో

దిశ, గద్వాల క్రైమ్ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కొత్త హౌసింగ్ బోర్డు సమీపంలో కలెక్టరేట్ ఎదురుగా ఉన్న భాగ్యలక్ష్మి భోజన హోటల్ లో కలుషిత భోజనం అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యజమాని తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్లితే.. ఓ కస్టమర్ భోజనం చేస్తుండగా ప్లేట్‌లో ఈగ కనిపించింది. దీని గురించి హోటల్ యజమాని దృష్టికి తీసుకెళ్లగా, అతను నిర్లక్ష్య ధోరణితో సమాధానం ఇచ్చాడు. "ఈగను పక్కకు పెట్టు లేదా మళ్లీ కొత్త ప్లేట్‌లో భోజనం చేయండి" అని బదులివ్వడం గమనార్హం. దీనిపై ప్రశ్నించగా, "ఇంతమందికి లేని సమస్య నీ ఒక్కనికే ఎందుకు?" అంటూ యజమాని దురుసుగా వ్యవహరించినట్లు బాధితుడు మీడియాకు తెలిపారు. యజమాని నిర్లక్ష్యపు సమాధానం భోజన ప్రియులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న హోటల్ యజమానిపై సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు, కస్టమర్‌లు డిమాండ్ చేస్తున్నారు.






