బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మ‌ద్యం సేవించడం చ‌ట్ట రిత్యా నేరం

by Ratna Kumari |

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్ట రీత్యా నేరమని.. అలాంటి వ్యక్తులపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని ఉప్పునుంతల ఎస్సై పుట్ట మహేష్ హెచ్చరించారు.

బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మ‌ద్యం సేవించడం చ‌ట్ట రిత్యా నేరం
X

దిశ, ఉప్పునుంతల : బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్ట రీత్యా నేరమని.. అలాంటి వ్యక్తులపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని ఉప్పునుంతల ఎస్సై పుట్ట మహేష్ హెచ్చరించారు. మద్యం సేవించి విచక్షణ కోల్పోయి తాగిన సీసాలు రోడ్డు పై పగులకొడితే వాటి వల్ల వాహనదారులకు, పాదచారులకు సైతం ప్రమాద వాటిల్లే అవకాశాలు ఉన్నాయని అలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ముఖ్యంగా యువత మత్తుకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నప్పుడు ప్రజలు గమనించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

Next Story