చేనేత ఎక్స్ లెన్స్ సెంటర్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి

by velandi.Saikiran |

నవంబర్ నెలాఖరు నాటికి చేనేత ఎక్స్ లెన్స్ సెంటర్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్

చేనేత ఎక్స్ లెన్స్ సెంటర్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: నవంబర్ నెలాఖరు నాటికి ఎట్టి పరిస్థితుల్లో చేనేత ఎక్స్ లెన్స్ సెంటర్ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద గల వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రం పక్కన కొనసాగుతున్న చేనేత ఎక్స్ లెన్స్ సెంటర్ నిర్మాణ పనులను గురువారం ఆమె స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ తో కలిసి పరిశీలించారు. డోర్స్, లైటింగ్, టాయిలెట్ బ్లాక్, సెంటర్ చుట్టూ ప్రహరీ పనులను చూసి మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సెంటర్ నమూనా మ్యాప్ ను చూశారు. హైదరాబాద్ టెస్కో ఓ ఎస్ డీ రతన్ కుమార్, మహబూబ్ నగర్ చేనేత జౌళి శాఖ ఏడి తో సెంటర్ పురోగతి పై చర్చించారు.

Next Story