- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆత్మకూరు-గద్వాల హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం వివాదస్పదం
ఆత్మకూర్-గద్వాల మధ్య కృష్ణా నదిపై నిర్మిస్తున్న హై లెవల్ బ్రిడ్జి(వారధి) అంశం ప్రస్తుతం రాజకీయంగా, న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యాయి.

దిశ, అమరచింత : ఆత్మకూర్-గద్వాల మధ్య కృష్ణా నదిపై నిర్మిస్తున్న హై లెవల్ బ్రిడ్జి(వారధి) అంశం ప్రస్తుతం రాజకీయంగా, న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యాయి. రాష్ట్ర మంత్రి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రతిష్టాత్మకంగా తీసుకుని, స్థానిక ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఈ బ్రిడ్జి నిర్మాణం ఆదిలోనే అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈ బ్రిడ్జి చుట్టూ రాజకీయ న్యాయ పరమైన అంశాలే కీలకంగా మారాయి. ఇరిగేషన్ శాఖ నిధులతో ఈ బ్రిడ్జి నిర్మాణ ప్రక్రియ టెండర్లు చేపట్టడం వివాదానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. రోడ్లు భవనాల శాఖ,(ఆర్ అండ్ బీ) పరిధిలోకి వచ్చే ఈ పనిని ఇరిగేషన్ నిధులతో ఎలా చేస్తారని, బీజేపీ ఎంపీ డీకే అరుణ, జూరాల ప్రాజెక్టు పరివాహక ప్రాంత నిర్వాసితులు అభ్యంతరం వ్యక్తం చేయడం తీవ్ర అయోమయానికి తావిస్తోంది.
జూరాల ప్రాజెక్టు పరివాహక ప్రదేశంలో ప్రాజెక్టు సేఫ్టీ కోసం నిర్మించాల్సిన ఈ బ్రిడ్జి ను ఆత్మకూర్-గద్వాల కనెక్టివిటీ రహదారిగా మార్చడం నిబంధనలకు విరుద్దంగా ఉందని, పాలమూరు ఎంపీ డీకే అరుణ బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా.. జూరాల ప్రాజెక్టు వద్ద ముంపు నిర్వాసితులతో బహిరంగ చర్చకు రావలసిందిగా రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి కి ఆమె సవాల్ విసిరారు. అదే సందర్భంలో ఆత్మకూర్-గద్వాల రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకం కాదని, ఆర్ అండ్ బీ నిధులతో హై లెవల్ బ్రిడ్జి నిర్మించాల్సిందిగా సూచించారు. జూరాల ప్రాజెక్టు సమీపంలో నిర్మించాల్సిన బ్రిడ్జి ను ఆత్మకూర్ కు తరలించడాన్ని సవాల్ చేస్తూ, కొంతమంది నిర్వాసితులు కోర్టు ను కూడా ఆశ్రయించినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న వివాదాలు కాంగ్రెస్, బీజేపీ పరస్పర ఆధిపత్య పోరుకు వేదికైంది. ఆత్మకూర్-గద్వాల రహదారి వంతెన నిర్మాణానికి రూ.121.92 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఇరిగేషన్ నిధులను పూర్తిగా ఆర్ అండ్ బీ శాఖకు బదిలీ చేసి, ప్రత్యేక చర్యలు చేపడితే ఈ చిక్కుముడి వీడేటట్లు లేదని స్పష్టమవుతుంది. ఏది ఏమైనా ప్రభుత్వ శాఖల నిధుల కేటాయింపు వల్ల రాజకీయ వివాదాలకు దారితీసింది. మరోవైపు ఆత్మకూరులో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు.






