కేశంపేట కాజ్ వే సౌకర్యవంతంగా నిర్మించండి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-02-26 14:19:30  IST  )

కేశంపేట కాజ్ వే సౌక‌ర్య‌వంతంగా నిర్మించాల‌ని గ్రామ‌స్తులు క‌లెక్ట‌ర్ కి గురువారం విన‌తి ప‌త్రం అంద‌జేశారు.

కేశంపేట కాజ్ వే సౌకర్యవంతంగా నిర్మించండి
X

దిశ‌, రేవ‌ల్లి : మండల పరిధిలోని కేశంపేట గ్రామ వెలుపల నూతనంగా నిర్మిస్తున్న కాజ్ వే నిర్మాణం అసౌకర్యంగా నాసిరకంగా నిర్మిస్తున్నారని దానిని సౌకర్యవంతంగా నాణ్యవంతంగా నిర్మించాలని కేశంపేట గ్రామస్తులు గురువారం వనపర్తి కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షా కాలంలో వరధ ఉదృతి అధికంగా ఉంటుందని.. ఆ సమయంలో ఇక్కడ రాకపోతే పూర్తిగా నిలిచిపోతున్నాయని తెలిపారు. గత కొన్నేళ్లుగా గ్రామం, మండల ప్రజలు జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి ఎన్నో అవస్తలను ఎదుర్కొన్నరు. ఎట్టకేలకు ప్రభుత్వ యంత్రాంగం స్పందించి కాజ్వేల్ (బ్రిడ్జి)నిర్మాణం చేప‌ట్టేందుకు పూనుకుంది. అయితే గుత్తే దారులు అక్కడ కేవలం పైపులు మాత్రమే వేస్తున్నారని.. దీనివల్ల వరద సమయంలో నీటి ప్రవాహానికి ఆటంకం నెలకొంటుందని నీరు వెళ్లే ద్వారాన్ని పెద్దగా నిర్మించాలని ప్ర‌జ‌లు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోపాల్ రావు, రామారావు, చలపతి రావు, యశోద రాంబాబు, సుదర్శనచారి, మహేష్ పాల్గొన్నారు.

Next Story