- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నియోజకవర్గం అభివృద్ధే ఎమ్మెల్యే 'యెన్నం' ప్రధాన ధ్యేయం
మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రధాన ధ్యేయం అని పలువురు చైర్మెన్లు వ్యాఖ్యానించారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రధాన ధ్యేయం అని పలువురు చైర్మెన్లు వ్యాఖ్యానించారు. శనివారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వివిధ శాఖల చైర్మెన్లు, పార్టీ నాయకులు మాట్లాడుతూ, ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి తోపాటు ఇతర రంగాల అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. మహబూబ్ నగర్ 'విద్యా నిధి' ఏర్పాటుచేసి నియోజకవర్గంలోని ప్రతి పేద విద్యార్థి చదువు మధ్యలో ఆగిపోకుండా వారికి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కరి అనిత, నాయకులు వినోద్ కుమార్, ఎన్పీ వెంకటేష్, ఎం.సురేందర్ రెడ్డి, సీజె బెనహర్, సిరాజ్ ఖాద్రీ, షబ్బీర్, అజ్మత్ అలీ, రాములు యాదవ్, నవనీత, ఫయాజ్ , అవేజ్, పీర్ సాదిక్, తదితరులు పాల్గొన్నారు.






