- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అశ్రు నయనాలతో కానిస్టేబుల్ అంత్ర క్రియలు
దిశ, రేవల్లి : మండల పరిధిలోని శానాయిపల్లి గ్రామానికి చెందిన ఎత్తపు ఆంజనేయులు పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుండగా..

దిశ, రేవల్లి : మండల పరిధిలోని శానాయిపల్లి గ్రామానికి చెందిన ఎత్తపు ఆంజనేయులు పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుండగా.. శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మృతుడి స్వగ్రామమైన శానాయిపల్లిలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. పేద కుటుంబంలో జన్మించి పోలీస్ ఉద్యోగం సాధించాడు ఆంజనేయులు. ఉద్యోగం సాధించిన సంవత్సరం తరువాత కుటుంబ పెద్ద తండ్రి బాలకృష్ణయ్య మరణించాడు. తండ్రి మరణించిన సంవత్సరం తరువాత మమతను పెళ్లి చేసుకున్నాడు.రోడ్డు ప్రమాదంలో ఆంజనేయుడు మరణించడంతో అతని కుటుంబం దిక్కులేనిదిగా అయిందని గ్రామస్తులు విలపిస్తున్నారు. మృతునికి తల్లి పోచమ్మ, భార్య మమత ఉన్నారు. శనివారం అంత్యక్రియలు శానాయిపల్లి గ్రామంలో నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ లాంఛనాల ప్రకారం నిర్వహించారు.






