కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

by Disha Web |
కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం
X

దిశ, మక్తల్: మక్తల్ పట్టణంలోని జాతీయ రహదారిపై ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో పేపర్ల లీకేజీలకు బాధ్యత వహించి ఐటీ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని రాస్తారోకో నిర్వహించి ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఆదేశాల మేరకు మండలాధ్యక్షుడు గణేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు రాజుల ఆసిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువులు మాట్లాడుతూ. ఇంటర్ బోర్డు ఫలితాల వైఫల్యం లీకేజీ వ్వవరాలపై ఆనాడు కఠిన చర్యలు తీసుకుంటే పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగేది కాదని, ఇందుకు కారకులైన వారిని చట్టపరంగా శిక్షించాలి డిమాండ్ చేశారు.

తెలంగాణ వస్తే ప్రతి కుటుంబానికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగులను విస్మరించిన కేసీఆర్ ప్రభుత్వానికి నిరుద్యోగ యువత రానున్న రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపడం ఖాయమన్నారు. యువతీ- యువకుల న్యాయమైన పోరాటాలకు వెన్నంటూ ఉంటూ వారి హక్కుల కొరకు కాంగ్రెస్ పార్టీ వెన్నంటూ ఉంటుందని నిరుద్యోగులు నిరుత్సాహ పడకుండా మీ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మీకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి నారాయణ జిల్లా ఎస్సీ సెల్ నాయకులు, ఎ. రవికుమార్ టౌన్ అధ్యక్షుడు, బోయ వెంకటేష్, కట్టవెంకటేష్, రవికుమార్, కల్లూరి గోవర్ధన్, అబ్దుల్ రెహమాన్, వాకిటి శ్యామ్, వాకిటి భీమేష్, ఓబ్లేష్, రమేష్, బాలు, బహదూర్, సుదర్శన్, నరసింహ, రాము, ప్రభు, మక్తల్ మండలం నాయకులు పాల్గొన్నారు.
Next Story