- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్ నిర్ణయాలు దేశానికే ఆదర్శం : కాంగ్రెస్ అధ్యక్షుడు బీసం చెన్నయ్య సాగర్
మండల కేంద్రంలోని రామాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నర్వ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీసం చెన్నయ్య సాగర్ తో పాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళుర్పించారు.

దిశ, నర్వ : మండల కేంద్రంలోని రామాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నర్వ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీసం చెన్నయ్య సాగర్ తో పాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా బీసం చెన్నయ్య సాగర్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ దైవమైన దివగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సమూలంగా రాష్ట్ర ప్రజలను మార్చేశారు అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో దివంగత సీఎం రామారావు ప్రవేశపెట్టిన పథకాల గురించి ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం కొనియాడారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు రెండు రూపాయలకే కిలో బియ్యం, ప్రతి పేదవాడి కడుపు నింపాలనేదే తన లక్ష్యం అని గుర్తు చేశారు. అలాగే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి.. ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. శాసనసభ రద్దు చేయడం జరిగిందన్నారు ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేసి నిరుపేదలు చదువుకోడానికి ప్రభుత్వ బడులను ఏర్పాటు చేయడం జరిగిందని కొనియాడారు. ప్రభుత్వ బడిలో నిరుపేదలైనటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టినట్టు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కృష్ణారెడ్డి, శరణప్ప, డాక్టర్ బాబు, కటిక శ్రీనివాసులు, వెంకట్రామ్ రెడ్డి, వెంకటన్న, రమేష్, వార్డ్ మెంబర్ వెంకటన్న పాల్గొన్నారు.






