- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం : ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్
రైతుల కళ్ళలో ఆనందం చూడడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం అన్ని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు.

దిశ, ఎర్రవల్లి : రైతుల కళ్ళలో ఆనందం చూడడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం అన్ని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ మల్లు రవి చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి నివేదిన బస్సు యాత్రను ఆదివారం ఎర్రవల్లి మండల కేంద్రంలో సంపత్ పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ బస్సు యాత్ర ముఖ్య ఉద్దేశం అన్నారు .కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. పేదలకు సన్నబియ్యం, ఉచిత కరెంట్, ఉచిత బస్సు ప్రయాణం, ఇంటిగ్రేటేడ్ పాఠశాలలు, ఇందిరమ్మ ఇండ్లు, కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, వికలాంగులకు ట్రై సైకిళ్లు, మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు,ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లు, మహిళలకోసం వడ్డీ లేని రుణాల పెంపు మహిళలకు పెద్ద పీట వేయడం, 75 వేల ఉద్యోగాలు, 500 కే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి కేవలం రెండున్నర ఏళ్లలోనే అభివృద్ధి చేసి చూపించడం జరిగిందని.. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ, ప్రజా పాలన, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతుందన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కొరకు కాదు ప్రజా శ్రేయస్సు కొరకు అలంపూర్ ప్రజలు నన్ను ఒకసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి నన్ను అత్యంత ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. దానికి అల్లంపూర్ నియోజకవర్గ అభివృద్ధిలో ముందు ఉంటానని సంపత్ కుమార్ తెలిపారు. మాయమాటలు చెప్పి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వారు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి వారు కర్నూలుకి పరిమిత మయ్యారు. తప్ప ఏ రోజు కూడా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల మధ్యలకు రాలేదన్నారు. ఈ కార్యక్రమంలో TGSGDCFL చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు రాజీవ్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు, ఎర్రవల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, జోగుల రవి, ధర్మవరం మధు నాయుడు, శేకుపల్లి నర్సిరెడ్డి, పోతురాజు సోమనాద్రి, ఈదన్న నాయుడు, కోదండపురం శ్రీనివాసరెడ్డి, రుక్మానంద రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, మండలాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళలు, యువత, రైతులు పాల్గొన్నారు.






