- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాన పార్టీలకు అమర'చింత'
అమర చింతలో కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ చైర్మన్ పదవీ దక్కే అవకాశం లేకుండా పోయింది.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో /అమరచింత : ఎన్నికల ఫలితాలు ఒక్కసారి ప్రధాన రాజకీయ పార్టీలలో ఉత్కంఠను కలిగిస్తాయి. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు వనపర్తి జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అమరచింత మున్సిపాలిటీలో నెలకొంది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా.. మూడు స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ, మూడు స్థానాలను బీజేపీ, మూడు స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకోగా.. ఒక స్థానంలో సీపీఐ గెలిచింది. ఈ మున్సిపాలిటీలో ఏ పార్టీకి కూడా అధికారాన్ని చేపట్టే విధంగా అవకాశం లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ సీపీఐ నుంచి గెలిచిన అభ్యర్థి మద్దతును తీసుకొని, మంత్రి శ్రీహరి ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకున్నప్పటికీ మొత్తం ఐదు ఓట్లే అవుతాయి.. పదవీని చేపట్టేందుకు మరో సభ్యుడి మద్దతు అవసరం అవుతుంది. అదే బీజేపీ, బీఆర్ఎస్ కూటమి ఏర్పడితే ఆరుగురు సభ్యులతో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవీ ని దక్కించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవగానే పార్టీల వారీగా క్యాంపులకు తరలి వెళ్లారు. ఈ మునిసిపాలిటీలో బీజేపీ, బీఆర్ఎస్ కూటమి గా ఏర్పడి మున్సిపాలిటీ అధికారాన్ని చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజకీయ చర్చలు ఎలా ఉన్న ఈ నెల 16వ తేదీ వరకు ప్రధాన పార్టీల ముఖ్య నేతలకు అమర'చింతలు తప్పవు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.






