- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'పాలమూరు' కోసం పాదయాత్ర చేస్తామంటే కదలిన కాంగ్రెస్ : బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచిపోయినా 90 శాతం పూర్తి అయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ను పూర్తి చేయడానికి తట్టెడు మట్టిని కూడా ఎత్తిపోయలేదని, 'పాలమూరు' ను పూర్తి చేయడానికి తాము పాదయాత్ర చేస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక వచ్చి నిద్ర లేసిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచిపోయినా 90 శాతం పూర్తి అయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ను పూర్తి చేయడానికి తట్టెడు మట్టిని కూడా ఎత్తిపోయలేదని, 'పాలమూరు' ను పూర్తి చేయడానికి తాము పాదయాత్ర చేస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక వచ్చి నిద్ర లేసిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆలవెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రాంమోహన్ రెడ్డి, అంజయ్య యాదవ్ తదితరులతో కలిసి మాట్లాడారు. 6 నెలలో పూర్తి అయ్యే పాలమూరు ప్రాజెక్టు ను సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని ప్రకటించడం పట్ల వారికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జడ్చర్ల లో మీటింగ్ పెట్టిన సీఎం వస్తే జిల్లా అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తారేమోనని ఎదురు చూసిన ప్రజలకు ఒక్క రూపాయి ప్రకటించకపోవడంతో నిరాశ ఎదురైందని ఆయన ఆరోపించారు. మన రాష్ట్రాన్ని, జిల్లా అభివృద్ధిని అడ్డకునేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మరోసారి రుజువైందని ఆయన విమర్శించారు.
పాలమూరు ప్రాజెక్టు ను పూర్తి చేయడానికి 3 నెలల సమయం ఇస్తున్నాం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి 3 నెలల టైం ఇస్తున్నామని, ఆ తర్వాత మా కార్యాచరణ ఉంటుందని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. నిలిచిన పనులు పూర్తి చేసేందుకు నిధులు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు చేయడానికే సీఎం వచ్చినట్లు ఉందని ఆయన విమర్శించారు. లక్ష కోట్ల రూపాయలతో జిల్లాను గ్రీన్ ఛానల్ చేస్తామన్నారు కదా, మరి ఆ డబ్బులు ఎక్కడికి పోయాయని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను మరిపించేందుకు సీఎం ఆడుతున్న నాటకాలని ఆయన ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాలంటివి, ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొడితివి, 4 వేల రూపాయల పెన్షన్ చేస్తానంటివి, మహిళలకు 2500 రూపాయలు ఎక్కడని, దళిత బందు, బీసీ బందు ఎక్కడుందని అని ఆయన నిలదీశారు. ముదిరాజ్ లను ఏ గ్రూప్ లోకి మార్చుతామంటిరి, రిటైర్డ్ వారికి బకాయిలు లేవని, తులం బంగారం, స్కూటీలు ఇస్తామని ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆయన దుయ్యబట్టారు. వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజల ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఇంతియాజ్, రాజేశ్వర్ గౌడ్, గంజి వెంకన్న, కెసి నర్సింహులు, వెంకటేశ్వర్ రెడ్డి, యాదయ్య, శివరాజ్, పాల్గొన్నారు.






