- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్నం నరేందర్ రెడ్డి ఓ కమీషన్ ఏజెంట్
పట్నం నరేందర్ రెడ్డి పై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, కోస్గి: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి జీర్ణించుకోలేకపోతున్నాడని జిల్లా గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయకుమార్, కోస్గి మున్సిపల్ చైర్ పర్సన్ నాగులపల్లి నరేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డిలు ఘాటుగా విమర్శించారు. సోమవారం కోస్గి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పట్నం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కార్యకర్తలతో కమీషన్లు తీసుకుంటూ, ఏజెంట్ గా మారాడని ఆరోపణలు చేశారు.
అదే ధోరణితో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూడడం విమర్శించడం ఆయనకే చెల్లిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో తిరుపతిరెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఇది జీర్ణించుకోలేక పట్నం నరేందర్ రెడ్డి పచ్చ కళ్ళతో చూస్తూ మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ఇకనైనా బుద్ధిగా మసులుకోవాలని, లేనిపక్షంలో నియోజకవర్గ ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ భీమ్ రెడ్డి వైస్ చైర్మన్ వేణుగోపాల్ మున్సిపల్ కౌన్సిలర్లు హరి బెజ్జ రాములు రాజేష్ తొడుం శ్రీను బాల్రాజ్ నర్సింలు రామచందర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






