కుడి చెరువు ప్రాంతంలో అగ్ని ప్రమాదం

by Batti.Sumithra |

పట్టణ కేంద్రంలోని కుడి చెరువు మత్తడి ప్రాంతంలో సోమవారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకొని మంటలు వ్యాపించాయి.

కుడి చెరువు ప్రాంతంలో అగ్ని ప్రమాదం
X

దిశ, చొప్పదండి : పట్టణ కేంద్రంలోని కుడి చెరువు మత్తడి ప్రాంతంలో సోమవారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకొని మంటలు వ్యాపించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ పెరమాండ్ల మానస గంగయ్య గౌడ్ పరిస్థితిని పర్యవేక్షించి ఫైర్ ఇంజన్ సర్వీస్‌కు సమాచారం అందించారు. సకాలంలో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ సందర్బంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక శాఖ సిబ్బందికి, సహకరించిన స్థానిక ప్రజలకు చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Next Story