- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పింఛన్దారులు ఈ నెల 25వ తేదీ లోపు లైవ్ వెరిఫికేషన్ చేయించుకోవాలి: తహసీల్దార్
పింఛన్ దారులు ఈ నెల 25వ తేదీలోపు లైవ్ వెరిఫికేషన్ పూర్తి చేయించుకోవాలని సికింద్రాబాద్ మండల తహసీల్దార్ పాండునాయక్ సూచించారు.

దిశ, బేగంపేట: పింఛన్ దారులు ఈ నెల 25వ తేదీలోపు లైవ్ వెరిఫికేషన్ పూర్తి చేయించుకోవాలని సికింద్రాబాద్ మండల తహసీల్దార్ పాండునాయక్ సూచించారు. గత కొద్ది రోజుల నుంచి వృద్ధాప్య, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళల పింఛన్ దారులను బస్తీల్లోనే లైవ్ వెరిఫికేషన్ చేశామని చెప్పారు. సికింద్రాబాద్ మండలంలో 11,708 మంది పింఛనాదారులు ఉన్నారని. లైవ్ వెరిఫికేషన్లో 7వేల మంది ఫించన్ దారులు వెరిఫికేషన్ చేయించుకున్నారని చెప్పారు. అయితే ఇంకా సుమారు 4700 మంది పింఛన్దారులు ఇంకా వెరిఫికేషన్ పూర్తి చేయించుకోలేదని ఆయన వివరించారు. తాము బస్తీల్లో నిర్వహించిన వెరిఫికేషన్ చేసే సమయంలో ఇంటికి తాళాలు వేసి ఉండటం, కొంత మంది అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లడం గమనించామని చెప్పారు. అలాంటి వారందరూ ఈ నెల 25వ తేదీ లోపు సికింద్రాబాద్ మండల కార్యాలయానికి వచ్చి లైవ్ వెరిఫికేషన్ చేsయించుకోవాలని లేనిపక్షంలో పింఛన్ తీసుకునేందుకు అనర్హులుగా ప్రకటిస్తామని చెప్పారు.






