డిమాంటి కాలనీ-3 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఒళ్లు గగుర్పొడిచే పోస్టర్ రిలీజ్

by Chukka Sudharani |

భారీ ప్రేక్షకాదారణ పొందిన డిమాంటి కాలనీ ఫ్రాంచైజీలో వస్తున్న మరో చిత్రం ‘డిమాంటి కాలనీ-3’.

డిమాంటి కాలనీ-3 రిలీజ్ డేట్ ఫిక్స్..  ఒళ్లు గగుర్పొడిచే పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: భారీ ప్రేక్షకాదారణ పొందిన డిమాంటి కాలనీ ఫ్రాంచైజీలో వస్తున్న మరో చిత్రం ‘డిమాంటి కాలనీ-3’. ‘ది ఎండ్ ఈజ్ టూ ఫార్ అవే’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీని అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో సుధన్ సుందరం, మనీష్ సింఘాల్, దుర్గా రామ్ చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్, ఆండీ జాస్కెలైన్, గురు సోమసుందరం, కదిర్, ఆషిక్ హుస్సేన్స్, అర్చన రవి చంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా ఒక దానిని మించి మరోటి భారీ విజయాన్ని అందుకుని ప్రేక్షకులను భయపెట్టాయి. ఇప్పుడు వచ్చే డిమాంటి కాలనీ-3పై కూడా ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడగా.. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. ‘ఈ ప్రదేశం గురించి ఆలోచిస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది.. ఉత్కంఠ కలుగుతుంది, పీడకలలు వస్తాయి. ఆ చీకటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి!!! డిమాంటి కాలనీ-3 తలుపులు తెరుచుకోబోతున్నాయి!! సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది’ అంటూ అదిరిపోయే పోస్టర్‌ను షేర్ చేశారు.

Next Story