D55 నుంచి క్రేజీ అప్డేట్.. చెన్నైలో శ్రీలీల, ధనుష్

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ ధనుష్, దర్శకుడు రాజ్ కుమార్ కలయికలో వస్తోన్న చిత్రం ‘ఓం’.

D55 నుంచి క్రేజీ అప్డేట్.. చెన్నైలో శ్రీలీల, ధనుష్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ ధనుష్, దర్శకుడు రాజ్ కుమార్ కలయికలో వస్తోన్న చిత్రం ‘ఓం’. ధనుష్ కెరీర్‌లో 55వ సినిమాగా రాబోతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ నుంచే క్రేజీ హైప్ క్రియేట్ అయింది. వండర్‌బార్ ఫిలింస్ అండ్ RTake స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా, మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే పూజాకార్యక్రామలతో ఘనంగా స్టార్ట్ అయినా ఈ చిత్రానికి సంబంధించి తాజాగా షూటింగ్ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం OM చిత్రీకరణ కోసం చెన్నైలోని రెడ్ హిల్స్‌లో ఒక భారీ సెట్‌ను ఏర్పాటు చేశారట. ధనుష్ అండ్ శ్రీలీల ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారని తెలుస్తుండగా.. ఇది వారిద్దరితో కూడిన అద్భుతమైన డ్యాన్స్ నంబర్ అని సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతుండగా.. ‘మారీ’లో ధనుష్, సాయి పల్లవి డ్యాన్స్‌తో దుమ్మురేపగా.. ఇప్పుడు ధనుష్, శ్రీలీలతో సాంగ్‌ అంటే ఇది ఏ రేంజ్‌లో ఉంటుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story