ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో కాంగ్రెస్ నాయ‌కుడు ఆత్మ‌హత్యాయ‌త్నం

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, నాగ‌ర్ క‌ర్నూల్ : నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం కాంగ్రెస్ నాయకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. స్థానిక ఎన్నికల నేప‌థ్యంలో ఈ ఘటన చోటు

ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో కాంగ్రెస్ నాయ‌కుడు ఆత్మ‌హత్యాయ‌త్నం
X

దిశ‌, నాగ‌ర్ క‌ర్నూల్ : నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం కాంగ్రెస్ నాయకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. స్థానిక ఎన్నికల నేప‌థ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవ‌డంతో నాగర్ కర్నూల్ జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్థానిక ఎన్నికల్లో నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం గ్రామానికి జనరల్ రిజర్వేషన్ వచ్చింది. అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బంగారయ్య తనకు మద్దతు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి ని, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిని ప్రాధేయపడ్డాడు. కానీ అదే గ్రామానికి చెందిన మరో కాంగ్రెస్ పార్టీ నాయకుని కి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మద్దతు ఇవ్వడంతో బంగారయ్య మనస్థాపన చెంది ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్యానికి ప్రయత్నించాడు. పక్కనే ఉన్న కార్యకర్తలు గమనించి నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Next Story