పురపాలక ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం

by Ratna Kumari |

అయిజ - దిశ : అయిజ పురపాలకలో పెరిగిపోయిన జనాభా, కూలిపోయిన మౌలిక వసతులు, రోజుకో సమస్యతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు

పురపాలక ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం
X

దిశ, అయిజ : అయిజ పురపాలకలో పెరిగిపోయిన జనాభా, కూలిపోయిన మౌలిక వసతులు, రోజుకో సమస్యతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అయినా ప్రభుత్వం మాత్రం నిద్రపోతోందని తీవ్రంగా విమర్శిస్తూ బీజేపీ అయిజ పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి నాయకులతో కలిసి మున్సిపల్ కమిషనర్ సీహెచ్ సైదులు కి వినతి పత్రం అందించారు. అనంతరం భగత్ రెడ్డి మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా అయిజ నగర పంచాయతీ 2012లో జనాభా కేవలం 14,000 ఉండగా.. 2020 నాటికి ఇది 22,082 కి పెరిగింది. ప్రస్తుతం 2024–25 నాటికి జనాభా 38,000 దాటినట్లు స్పష్టమైన అంచనా. కానీ జనాభా పెరుగుదలని పట్టించుకోకుండా, ప్రజల సమస్యలను లెక్కచేయకుండా, ఇప్పటికీ మున్సిపాలిటీలో కేవలం 20 వార్డులే ఉంచడం ప్రభుత్వం ప్రజలపై చేసిన భారీ అన్యాయం అని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం.. ఒక్కో వార్డుకు 1300–1500 మంది మాత్రమే ఉండాలి. కానీ అయిజలో ఒక్కో వార్డు మీద 2300, 2600 జనాభా ఉంది, ప్రజా సేవలు పూర్తిగా కుప్పకూలిపోయాయి.నీటి సరఫరా దెబ్బతింది శానిటేషన్ పరిస్థితి అధ్వాన్నం. వీధులు, డ్రైనేజీలు అరణ్యరాజ్యం.ప్రజల్లో తీవ్ర అసంతృప్తి. ఈ పరిస్థితిని సృష్టించినది ప్రభుత్వ నిర్లక్ష్యమేనని భగత్ రెడ్డి స్పష్టం చేశారు.


అయిజ మున్సిపాలిటీ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరుతూ.. వార్డు పెంపుపై వెంటనే చర్యలు తీసుకోవాలి. అయిజ మున్సిపాలిటీలో సరాసరిగా ప్రతి వార్డులో 1000 నుంచి 1200 జనాభాను తీసుకొని, ప్రస్తుతం ఉన్న 20 వార్డులను 30 వార్డులుగా పునర్విభజన చేపట్టాలి. దీనివలన ప్రజల యొక్క పాలనకు సులువు మరియు వేగువంతం అవుతుంది. అయిజ అభివృద్ధిని అడ్డుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసలు ఉద్దేశమా? జనాభా పెరిగినా వార్డులు పెంచకుండా ప్రజలను బాధలోకి నెడుతున్న ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. 20 నుండి 30 వార్డులుగా పునర్విభజన తక్షణం ఏర్పాటు చేయాలి. లేకపోతే బీజేపీ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది అని భగత్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రదీప్ కుమార్, అయిజ పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, అంజి, లక్ష్మన్న, మాధవాచారి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story