నిరుపేద‌ల‌కు సొంతింటి క‌ల నెర‌వేర్చింది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే : ఎమ్మెల్యే మేఘారెడ్డి

by Ratna Kumari |

దిశ, గోపాల్ పేట : మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లలబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నాటి ఇందిరమ్మ కాలం నుంచి నేటి వరకు

నిరుపేద‌ల‌కు సొంతింటి క‌ల నెర‌వేర్చింది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే : ఎమ్మెల్యే మేఘారెడ్డి
X

దిశ, గోపాల్ పేట : మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లలబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నాటి ఇందిరమ్మ కాలం నుంచి నేటి వరకు నిరుపేదలకు అండగా నిలిచి సొంతింటి కలను నెరవేరుస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని నేడు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ప్రతి నిరుపేదకు ఐదు లక్షల రూపాయలతో సొంత ఇంటి నిర్మాణాలు చేపట్టిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ సందర్భంగా గోపాల్పేట మండలం చెన్నూరు గ్రామంలోని ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాలు చేపట్టిన లబ్ధిదారులకు ఆయన నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.గ్రామానికి చెందిన 1.బిసిరెడ్డి,2.కావలి రాజు, 3.సెగిరెడ్డి మాధవి ,4. ఎండి హసీనా బేగం,5. కేతావత్ దుధ్యా,6. కేతవత్ గోపాల్,7.మూడవ మంగమ్మ, 8.బొందిలి సునీత ఎనిమిది మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే నూతన వస్త్రాలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోపాల్పేట ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ సత్యశీలారెడ్డి, రేవల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వాడల పర్వతాలు, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు చారి, టౌన్ అధ్యక్షుడు శివన్న, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొంకి వెంకటేష్, వెంకటయ్య, మల్లేష్,రాజ వర్ధన్ గౌడ్, ఎల్లయ్య, అంబ్రు నాయక్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Next Story