అంగన్ వాడీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశ ప‌రిచింది : సీఐటీయూ

by Ratna Kumari |

దిశ‌, మ‌క్త‌ల్ : అంగ‌న్ వాడీల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూడా నిరాశ ప‌రిచింది అని సిఐటీయూ రాష్ట్ర నాయ‌కురాలు శార‌ద పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ అంగ‌న్ వాడీ

అంగన్ వాడీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశ ప‌రిచింది : సీఐటీయూ
X

దిశ‌, మ‌క్త‌ల్ : అంగ‌న్ వాడీల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూడా నిరాశ ప‌రిచింది అని సిఐటీయూ రాష్ట్ర నాయ‌కురాలు శార‌ద పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ అంగ‌న్ వాడీ టీచ‌ర్స్ అండ్ హెల్ప‌ర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా రెండో మహాసభలు మక్తల్ పట్టణ కేంద్రంలో ఘనంగా ప్రారంభమ‌య్యాయి. పడమటి ఆంజనేయస్వామి దేవాలయం నుంచి ఎస్ఆర్ఎం ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంత‌రం మ‌హాస‌భ‌లు ప్రారంభం అయ్యాయి. ముఖ్య వ‌క్త‌గా హాజ‌రైన రాష్ట్ర నాయ‌కురాలు శార‌ద మాట్లాడారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అంగ‌న్ వాడీల‌కు ప‌లు ఆన్ లైన్ ప‌నుల‌ను అప్ప‌జెప్పుతున్నాయ‌ని.. ఆన్ లైన్ కు వాడే మొబైల్ ఫోన్లు నాణ్య‌త లేక స‌రిగ్గా ప‌ని చేయడం లేద‌న్నారు. నూత‌న జాతీయ విద్యా విధానంతో అంగ‌న్ వాడి కేంద్రాల ఉనికికే ప్ర‌మాదంలో ప‌డింద‌ని.. ప్రీ ప్రైమ‌రీ, పీఎం శ్రీ విద్య‌ను అంగ‌న్ వాడీల‌కే అప్ప‌జెప్పాల‌ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు రూ.18వేల క‌నీస వేత‌నం, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ధ‌ర‌ల‌కు అనుగుణంగా మెస్ ఛార్జీల‌ను పెంచాల‌ని.. క‌నీస వేత‌నం అమ‌లు చేయాల‌ని అన్నారు. పోష‌ణ అభియాన్, పోష‌న్ ట్రాక్, ఫేస్ క్యాప్చ‌ర్స్, బ‌యోమెట్రిక్ విధానం వ‌ల్ల అంగ‌న్ వాడీలు తీవ్ర మాన‌సిక ఒత్తిడికి గుర‌వుతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ మ‌హాస‌భ‌ల్లో సీఐటీయూ జిల్లా అధ్య‌క్షులు వెంక‌ట్రామ్ రెడ్డి, జిల్లా కార్య‌ద‌ర్శి బాల్ రామ్, జిల్లా ఉపాధ్య‌క్షులు ఆంజ‌నేయులు, జిల్లా స‌హాయ కార్య‌ద‌ర్శి జోషి, అంగ‌న్ వాడీ టీచ‌ర్లు పాల్గొన్నారు.

Next Story