- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయిజలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం : మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్
అయిజలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేర్కొన్నారు.

దిశ, అయిజ : అయిజలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం అయిజ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అయిజ పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా కచ్చితంగా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి పట్టణ సుందరీకరణకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోని బీఆర్ఎస్ నాయకులకు ఈనాడు ప్రజలు గుర్తొచ్చారా అంటూ విమర్శించారు. రేపు ఈ ప్రాంతంలో రాష్ట్ర నాయకులు సమావేశం నిర్వహించనున్నారని తెలిపారు. ప్రత్యేక మైన ఫస్ట్ రేపు రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. పట్టణ ప్రజలు సహకరించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష నేతలను కాకుండా అధికార పార్టీని నేతలను గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలంపూర్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో రవాణా సౌకర్యం కల్పించే దిశగా రానున్న రోజుల్లో కృషి చేస్తామని.. రాష్ట్ర నాయకులతో చర్చించామని త్వరలోనే పనులు పూర్తి చేస్తామని తెలిపారు.






