మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్లను నియమించిన కాంగ్రెస్

by Ratna Kumari |

మున్సిపల్ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్, 18 మునిసిపాలిటీలకు కోఆర్డినేటర్లను నియమిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గురువారం జాబితా విడుదల చేశారు.

మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్లను నియమించిన కాంగ్రెస్
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : మున్సిపల్ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్, 18 మునిసిపాలిటీలకు కోఆర్డినేటర్లను నియమిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గురువారం జాబితా విడుదల చేశారు. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆర్డినేటర్ గా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నీ నియమించారు. నారాయణపేట మున్సిపాలిటీ కోఆర్డినేటర్ గా పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ వంశీ చందు రెడ్డి, కోస్గి ముంగి జైపాల్ రెడ్డి, మద్దూరు ఆదం రాజ్, అమరచింత ప్రొఫెసర్ కట్టి వెంకటస్వామి, మక్తల్ మోతే శ్రీలత రెడ్డి, ఆత్మకూరు ఏ. జంగారెడ్డిని నియమించారు. భూత్పూర్ కొన గాల్ల మహేష్, దేవరకద్ర చేనగాని దయాకర్ ను నియమించారు. అలంపూర్ షేక్ షావలి ఆచారి, ఐజ డాక్టర్ కే తూరి వెంకటేష్, గద్వాల ఎస్ రాములు నాయక్, వడ్డేపల్లి జి హర్షవర్ధన్ రెడ్డి, కల్వకుర్తి మల్ రెడ్డి రాంరెడ్డి, కొల్లాపూర్ సానం శ్రీనివాస్ గౌడ్, నాగర్ కర్నూల్ చిక్కుడు వంశీకృష్ణ, కొత్తకోట సయ్యద్ నిజాముద్దీన్, పెబ్బేరు శ్రీనివాసరెడ్డి, వనపర్తి సంభాని చంద్రశేఖర్ నియమితులు అయ్యారు.

Next Story